English | Telugu
లిప్ స్టిక్ ని అచ్చ తెలుగులో ఏమంటారు?
Updated : Jul 27, 2022
బుల్లితెర మీద కనిపించే సుధీర్ ని చూస్తే చాలు ఇప్పుడు ఆడియన్స్ కి ఎక్కడలేని ఎనర్జీ అనేది వచ్చేస్తుంది. కష్టపడి ఎదిగిన వ్యక్తిగా కూడా సుధీర్ ఆడియన్స్ మనసులో మంచి పేరు సంపాదించుకున్నాడు. సుధీర్ ఉంటే చాలు ఆ షో సందడిగా కూడా ఉంటుంది. సుధీర్ షోకి టీఆర్పీ రేటింగ్స్ కూడా అదే స్థాయిలో ఉంటుండడంతో మేకర్స్ కూడా ఆయన్నే షోస్ కి ఎగరేసుకుపోతున్నారు. ఇక ఇప్పుడు సుధీర్ అనసూయతో కలిసి స్టార్ మా సింగింగ్ షోలో హోస్ట్ గా చేస్తున్నాడు. ఇప్పుడు ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ షోలో సుధీర్ అనసూయ మీద పంచులు మీద పంచులు వేసి కడుపుబ్బా నవ్వు తెప్పించాడు. సుధీర్ ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఎంట్రీ ఇస్తాడు. అతని మాటలకు అక్కడికి వచ్చిన అనసూయ పద్దతి, పాడు లేకుండా వచ్చారు అంటూ సుధీర్ పై మండిపడుతుంది. ఏవండీ మాదీ పల్లెటూరే..కానీ ఇప్పుడు దానికి సిటీ అని పేరు పెట్టారంటా అంటాడు..ఎం సిటీయో అని మూతి తిప్పుకుంటూ అడుగుతుంది "పబ్లిసిటీ" అంటాడు.
నేను కూడా అప్పుడు సిటీకి వచ్చాను అంటుంది అనసూయ. ఎం సిటీ అంటాడు సుధీర్. సింప్లిసిటీ అంటుంది అనసూయ. ఇలాంటి పంచ్ డైలాగ్స్ వింటుంటే నేను ఇంకో సిటీకి వెళ్ళిపోయాను అంటారు చిత్రగారు. ఎం సిటీకి వెళ్లారు అంటుంది అనసూయ. "స్కెర్ సిటీ " అంటారు చిత్ర గారు. ఇలా కాసేపు సిటీ మీద పంచ్ డైలాగ్స్ ఐన తర్వాత కొన్ని సింగింగ్ పెర్ఫార్మెన్స్లు అయ్యాక "నేను కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ చెప్తాను వాటిని అచ్చ తెలుగులో ఏమంటారో చెప్పండి అంటాడు సుధీర్ అనసూయను. సరే మైక్ ని ఏమంటారో చెప్పండి అంటాడు. మైకును మైక్ అంటారంటుంది. కాదు ధ్వని శబ్ద గొట్టం అంటారని చెప్తాడు. ఫోన్ ని ఏమంటారు అంటాడు. చరవాణి అంటుంది అనసూయ. చరవాణి, లంగావోణీ కాదు శబ్ద మాటల గొట్టం అంటాడు. ఐస్ క్రీంని తెలుగులో చెప్పమంటాడు. హిమక్రీము అంటుంది. కాదు హిమక్రీములు వేసుకునే గొట్టం అంటాడు. ఫైనల్ గా లిప్ స్టిక్ ని ఏమంటారు అని అడుగుతాడు. దీనికి సుధీర్ అన్నే ఆన్సర్ చెప్పగలుగుతాడు అంటాడు హేమచంద్ర. పెదాల్ని రంగురంగులుగా మార్చే గొట్టం అని అనసూయకు అందకుండా జడ్జెస్ దగ్గరకి పరిగెత్తుతాడు. అక్కడ అందరూ కలిసి సుధీర్ ని బాదేస్తారు. పల్లెటూరికి, పట్నం జోరుకి మధ్య రసవత్తర పోరు శీర్షికతో ఈ ఎపిసోడ్ రాబోతోంది.